Dunki Movie | సైలెంట్‌గా కలెక్షన్స్ కొల్లగొడుతున్న షారుఖ్ ‘డంకీ’.. వారం రోజుల్లోనే రూ.305 కోట్లు
Dunki Movie | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది హ్యట్రిక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న షారుఖ్ తాజాగా డంకీ సినిమాతో హ్యట్రిక్ అందుకున్నాడు.
Dunki Movie| బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది హ్యట్రిక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న షారుఖ్ తాజాగా డంకీ సినిమాతో హ్యట్రిక్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో ప్రస్తుతం రన్ అవుతుంది.
మొదటిరోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ యావరేజ్‌గానే ఉండగా.. మెల్లిమెల్లిగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ (Box Office collections) రాబడుతోంది. తాజా సమాచారం ప్రకారం. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్స్ చూసుకుంటే.. 8 రోజుల్లో రూ.305 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొదట ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉండగా.. ఇప్పుడు పరుగులు పెడుతుంది. ఇక రానున్న వీకెండ్‌తో మరో రూ.100 కోట్లు డంకీ వసూలు చేసే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామంలో నలుగురు స్నేహితులు ఇంగ్లండ్ వెళ్ళాలి అనుకుంటారు. అయితే వారు వెళ్లడానికి డబ్బు కానీ, వీసాలకి తగినంత చదువు కానీ ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి వచ్చిన హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఇంగ్లండ్ తీసుకెళుతానని చెబుతాడు. దీనికోసం హార్డీ ప్రణాళికలు చేస్తాడు. అయితే ఈ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి. ఈ క్రమంలోనే వారు ఇంగ్లండ్ వెళ్లడానికి అక్రమ మార్గం ఎంచుకుంటారు. దొంగతనంగా డంకీ ట్రావెల్ ద్వారా లండన్‌కు వెళ్లాలి అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు వాళ్ళు లండన్ కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? అనేది అసలు కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

