Dunki Drop 3 | హృదయాలను హత్తుకునేలా ‘డంకీ’ డ్రాప్ 3
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), ‘పీకే'(PK), ‘సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను (Tapsee Pannu) నటిస్తుంది.
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). త్రీ ఇడియట్స్ (3 Idiots), ‘పీకే'(PK), ‘సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను (Tapsee Pannu) నటిస్తుంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన డంకీ డ్రాప్ 1, డ్రాప్ 2 లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి డంకీ డ్రాప్ 3 అంటూ మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు.
నిక్లే ది కభీ హమ్ ఘర్ సే (Nikle The Kabhi Hum Ghar Se) అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను మేకర్స్ వదిలారు. (మేము ఇంట్లో నుంచి ఎప్పుడో బయటకి వచ్చాము కానీ.. ఇల్లు మా మనసులోనే ఉంది. ప్రతి గుండె చప్పుడులో ఇల్లు కొలువై ఉంది అలాంటి మనసుని ఏం చెయ్యాలి) అంటూ హృదయాలను హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాట చూస్తే.. అక్రమంగా ఇంగ్లాండ్ వెళ్లడానికి షారుఖ్ అండ్ గ్యాంగ్ ఎలాంటి ప్రయాత్నాలు చేశారు అనేది పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు జావేద్ అక్తర్ సాహిత్యం అందించగా.. సోను నిగమ్ పాడాడు. ప్రీతమ్ సంగీతం అందించాడు.
ఇక డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

