Dune: Part Three Official Trailer | ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, ‘డ్యూన్ మెస్సయ్య’ నవల ఆధారంగా రూపొందింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. పార్ట్-2 ముగిసిన 20 ఏళ్ల తర్వాత జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. చక్రవర్తి అయిన పాల్ అట్రీడీస్ (తిమోతీ చాలమే) ఎదుర్కొనే యుద్ధాలు, కుట్రలు, అలాగే పాల్-చానీ (జెండాయా) మధ్య వచ్చే విభేదాలను ట్రైలర్లో అద్భుతంగా చూపించారు. ఈ భాగంలో రాబర్ట్ ప్యాటిన్సన్ ‘స్కైటేల్’ అనే సరికొత్త విలన్ పాత్రలో నటిస్తుండగా, మరణించిన డంకన్ (జేసన్ మోమోవా) ‘హైట్’ అనే క్లోన్ రూపంలో రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. హాన్స్ జిమ్మెర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, భారీ విజువల్స్‌తో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు వార్నర్ బ్రదర్స్ సన్నాహాలు చేస్తోంది.