I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dulquer Salmaan | మలయాళంతో పాటు తెలుగులోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I'm Game) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar) దక్కించుకుంది.
Dulquer Salmaan | మలయాళంతో పాటు తెలుగులోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar) దక్కించుకుంది. దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 6 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
గతంలో ‘ఆర్డీఎక్స్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన యువ దర్శకుడు నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కంది. గ్యాంబ్లింగ్ మరియు ఫాంటసీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటన, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా.. ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కథిర్, వినయ్ ఫోర్ట్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వయంగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించగా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు నవంబర్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
DEO Ramesh | సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : డీఈవో రమేశ్
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

