Sita Ramam | దుల్కర్ ‘సీతారామం’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Sita Ramam Teaser Date | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన నటిస్తున్న తెలుగు చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
సీతారామం టీజర్‌ను జూన్ 25న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.
#SitaRamamTeaser Stamped & Sealed today, Delivering tomorrow at 4 PM!
Our first letter to you! We're excited, how excited are you?#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamFromAug5 pic.twitter.com/kooG4YdLGI
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

