Lucky Baskhar | ఓ సగటు మనిషి జీవితం లక్కీభాస్కర్
“లక్కీ భాస్కర్' ఓ కొత్త ప్రయత్నం. వెంకీ చూడ్డానికి చిన్నాకుర్రాడిలా ఉంటాడు. కానీ తను రాసిన సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
Lucky Baskhar | “లక్కీ భాస్కర్’ ఓ కొత్త ప్రయత్నం. వెంకీ చూడ్డానికి చిన్నాకుర్రాడిలా ఉంటాడు. కానీ తను రాసిన సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం లక్కీభాస్కర్. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.
అతిథుల్లో ఒకరైన దేవరకొండ విజయ్ మాట్లాడుతూ ‘యాక్టర్ అవ్వకముందు దుల్కర్ సినిమాలు చూస్తూ ఉండేవాడ్ని. దుల్కర్‌తో మహానటి, కల్కి సినిమాలు చేశా. కానీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. త్వరలో ఆ కోరిక తీరుతుందనుకుంటున్నా. ‘లక్కీభాస్కర్’ పెద్ద హిట్ అవ్వాలి’ అని ఆకాంక్షించారు. మరో అతిథి త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాను. వెంకీ ఈ కథను డిజైన్ చేసిన తీరు వండర్. ఇందులోని ప్రతి పాత్రా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక దుల్కర్ వేరే లెవల్. ఇప్పటివరకూ చూసిన దుల్కర్ వేరు. ఇందులోని దుల్కర్ వేరు.’ అన్నారు. ఇంకా దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, రాంకీ, మానసా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

