ఆకాశం హద్దులు దాటి..
కల్పన చదువులో ఫస్ట్ ర్యాంకర్. గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ ఆమెకు ప్రోత్సాహం అందించే వారు ఎవరూ లేరు. చివరకు తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి ఆమె ఆశయాలకు అడ్డుకట్ట వేస్తారు.
అలాంటి సమయంలో కృష్ణ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలుస్తాడు. కల్పన కలల సాకారానికి భరోసాగా ఉంటాడు. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఓ అమ్మాయి ఎలాంటి విజయాలు సాధిస్తుందో నిరూపిస్తాడు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం చాటిచెప్పే ఇలాంటి కథతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకుడు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు.
శనివారం టీజర్ను విడుదల చేశారు. గ్రామం పరిధులు దాటలేని ఓ అమ్మాయి ఆకాశమే హద్దుగా తన కలల్ని సాకారం చేసుకునే వైనాన్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆద్యంతం స్ఫూర్తివంతంగా, భావోద్వేగాలతో సాగింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, రచన: గంగరాజు గుణ్ణం, దర్శకత్వం: పవన్ సాధినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

