varun doctor and kurup | కొన్ని సినిమాలు విడుదలయ్యేంత వరకు వస్తున్నట్లు తెలియదు.. గానీ వచ్చిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ మ్యాజిక్ చేసి చూపించాయి. ఆ సినిమాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులకు కనీసం ఎలాంటి ఐడియా లేదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేసుకోలేదు. అలాంటిది సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత.. మౌత్ పబ్లిసిటీతో సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి రెండు మూడు రెట్లు లాభాలు తీసుకొస్తున్నాయి. సరిగ్గా రెండు నెలల కింద శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమా విడుదలైంది. తమిళంలో ఇది బ్లాక్ బస్టర్. తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు.
నిజానికి పెద్దగా అంచనాలు లేకుండా.. చాలా తక్కువ థియేటర్స్‌లో వరుణ్ డాక్టర్ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో మెల్లమెల్లగా స్క్రీన్ సంఖ్య పెంచారు. అలా రెండు మూడు వారాలు సినిమా బాగానే ఆడింది. రూ.1.25 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన వరుణ్ డాక్టర్ దాదాపు 2.70 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు కోటిన్నర లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా. ప్రస్తుతం విజయ్‌తో బీస్ట్ సినిమా తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ డాక్టర్ సినిమాకు దర్శకుడు. తాజాగా మరో సినిమా కూడా ఇలాంటి మ్యాజిక్ చేసింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురుప్ నవంబర్ 12న విడుదలైంది. అత్యంత తక్కువ స్క్రీన్స్ లో ఈ సినిమా వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమా విడుదలైనట్టు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కూడా. తెలుగులో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా రూ.75 లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా.. వారం రోజుల్లో కోటి 75 లక్షల పైగా షేర్ వసూలు చేసింది. తద్వారా బయ్యర్లకు కోటి రూపాయలకు పైగా లాభాలు తీసుకువచ్చింది ఈ సినిమా ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు.. అందులోనూ డబ్బింగ్ సినిమాలు బయ్యర్లకు మంచి లాభాలు తీసుకొస్తుండటం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చంద్రబాబు ఏడుపుపై తన మార్క్ సెటైర్లు వేసిన ఆర్జీవీ
Bollywood Actress Marriage | పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్..!
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..
Nayanthara remuneration | గాడ్ ఫాదర్‌కు నయనతార పారితోషికం వింటే షాకే..!
Sneha Business Fraud | నటి స్నేహకు రూ.26 లక్షలు టోకరా..పీఎస్‌లో ఫిర్యాదు..!