వినోదంతో కూడిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’
‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే ‘డ్రాగన్'. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా ‘లవ్ టుడే’ని బాగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా.’ అని హీరో ప్రదీప్ రంగనాథన్ అన్నారు.
‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే ‘డ్రాగన్’. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నా ‘లవ్ టుడే’ని బాగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా.’ అని హీరో ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కథానాయికలు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలు. ఈ నెల 21న మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు.
దర్శకులు హరీశ్‌శంకర్, సాయిరాజేష్, కిశోర్ తిరుమల, నిర్మాత ఎస్కేఎన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ నిజంగా మంచి సినిమా. అందుకే విజయంపై నమ్మకంతో ఉన్నా.’ అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు. యువతరం మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాత అర్చనా కల్పాతి చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

