DRR Productions | ఘనంగా డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం.. డాక్టర్ దామోదర్ నేరేళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్!
DRR productions | డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ (DRR Productions) బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏఎంఏ) వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ దామోదర్ నేరేళ్ల ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు.
డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ (DRR Productions) బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏఎంఏ) వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్ దామోదర్ నేరేళ్ల ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శశాంక్ దువ్వూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతూ, మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ దామోదర్ నేరేళ్లకు సినిమాలపై చిన్నప్పటి నుంచే ప్రత్యేక ఆసక్తి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా చూడటానికి పాఠశాలకు వెళ్లకుండా వరంగల్ వెళ్లిన రోజులు ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇన్నాళ్లుగా తనలో ఉన్న సినిమా కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నానని, తన డ్రీమ్ ప్రాజెక్టు దసరా రోజున ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. దర్శకుడు శశాంక్ దువ్వూరు చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని, ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఇందులో ఉన్నాయని వివరించారు.
గతంలో రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, ‘ఉల్టా’ షార్ట్ఫిలింను కూడా రూపొందించానని దర్శకుడు శశాంక్ దువ్వూరు తెలిపారు. పైకి లైట్‌హార్టెడ్ ఎంటర్టైనర్లా కనిపించినప్పటికీ, ఈ సినిమాలో బలమైన కాన్సెప్ట్ ఉంటుందని చెప్పారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథలో వినోదంతో పాటు విభిన్నమైన అంశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నట్లు వివరించారు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులు మాట్లాడుతూ.. సాధారణ కథలకు భిన్నంగా, పక్కా స్క్రిప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలిపారు. రొమాంటిక్ అంశాలతో ప్రారంభమయ్యే కథ క్రమంగా సైన్స్ ఫిక్షన్ వైపు మలుపు తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

