Double iSmart | ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది
Double iSmart | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) ఒకటి. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుండగా.. ఈ ఇద్దరి కలయిలకలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.
Double iSmart | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) ఒకటి. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుండగా.. ఈ ఇద్దరి కలయిలకలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని.. ఈ సీన్ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మే 15న రామ్ పోతినేని బర్త్‌డే.. ఈ సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ నుంచి టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్‌కు అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.
#DoubleISMART – Teaser – 15th May pic.twitter.com/BFRAb5qAyy
— Aakashavaani (@TheAakashavaani) May 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

