మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(SYG). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
డాలీ ధనంజయ్ ఇందులో ‘అర్జున్’గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషించిన అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేకమైన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సీరియస్ లుక్‌లో హుందాగా కనిపిస్తున్న డాలీ ధనంజయ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్.