SAINDHAV | సైంధవ్ అప్డేట్.. వెంకటేశ్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోంది. ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రుహానీ శర్మ , ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం సైంధవ్ టీం ప్రస్తుతం విదేశాల్లో ఉంది. శ్రీలంకలో సైంధవ్ షూటింగ్ కొనసాగుతుండగా.. వెంకటేశ్‌తోపాటు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సైంధవ్ నుంచి ఇటీవలే మానస్ (Manas)ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారని తెలిసిందే. మానస్ పాత్రలో నటిస్తున్న టాలెంటెడ్ యాక్టర్ ఆర్య లాంగ్ హెయిర్‌తో స్టైలిష్‌గా గన్ పట్టుకుని వస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సైంధవ్ మిషన్‌లో భాగమయ్యే శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో రుహానీ శర్మ డాక్టర్‌గా కనిపించనుండగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్ర పోషిస్తున్నాడు. మేకర్స్ చాలా రోజుల క్రితం విడుదల చేసిన సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగనున్న సైంధవ్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

