Bhola Shankar | చిరంజీవి భోళా శంకర్ రన్ టైం ఎంతో తెలుసా..?
Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది చిరు టీం.
Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది చిరు టీం.
మెగా సెలబ్రేషన్స్ టైం మొదలైంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆగస్టు 6న సాయంత్రం 7 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందంటూ మేకర్స్ ఇప్పటికే ఓ న్యూస్ అందరితో పంచుకున్నారు. కాగా ఇప్పుడు భోళాశంకర్ రన్ టైం న్యూస్ తెరపైకి వచ్చింది. ఇంతకీ సినిమా రన్‌టైం ఎంతో తెలుసా..? సీబీఎఫ్సీ ప్రకారం సినిమా నిడివి 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు). తెలుగు వెర్షన్లో చిరంజీవి ఇమేజ్, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశాడట మెహర్ రమేశ్.
ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చిరంజీవి మరోవైపు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ రీమేక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
భోళాశంకర్ ట్రైలర్..
మిల్కీ బ్యూటీ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

