Divyenndu Sharma | అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో ‘మీర్జాపూర్’ మున్నా భయ్యా
Divyenndu Sharma | రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి.
Divyenndu Sharma | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేకర్స్. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కర్ణాటకలో షూటింగ్ ప్రారంభించింది.
అయితే ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. దర్శకుడు బుచ్చిబాబు సనా ‘ఆర్సీ16’లో మున్నా భయ్యా నటించబోతున్నాడు అంటూ ప్రకటించాడు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్య పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్సీ16’ సినిమాకు అతడు ప్లస్ అవుతాడని చిత్రబృందం భావించినట్లు ఉంది. మరోవైపు ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనుండగా.. రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.
Our Bhayya…
Your Bhayya…
MUNNA BHAYYA!Welcome onboard dear @divyenndu brother 🤍🤗
Let’s rock it💥#RC16 pic.twitter.com/55r3LeAzp7— BuchiBabuSana (@BuchiBabuSana) November 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

