ముంబై: దిశా పటానీ ( Disha Patani ) ఓ వాటర్ బేబీ. ఆమెకు బీచ్లన్నా.. పూల్స్ అన్నా ఇష్టం. ఆ క్యూటీ స్టార్ ఇప్పుడు తన ఇన్‌స్టాలో ఓ కొత్త వీడియో పోస్టు చేసింది. 28 ఏళ్ల బాలీవుడ్ సుందరి.. తన కొత్త పోస్టులోనూ బీచ్ లుక్‌లో దర్శనమిచ్చింది. డెస్టినేషన్ ఎక్కడో చెప్పని దిశ.. ఆ వీడియోలో బీచ్ లుక్స్‌తో అదరగొట్టింది. బికినీ టాప్.. పువ్వుల స్కర్ట్‌తో ఆమె బీచ్ లొకేషన్లో వయ్యారంగా నడుస్తూ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో డోజో క్యాట్ సాంగ్ ప్లే అవుతుంటే.. దిశా బీచ్ వాక్ చేసింది. అయితే బీచ్ రోజుల్ని మిస్సవుతున్నట్లు ఆ వీడియో ఆమె కామెంట్ పెట్టింది. ఓ పువ్వు.. అలల ఎమోజీని కూడా దానికి ట్యాగ్ చేసిందా అందాల భామ.