VV Vinayak | టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ డైరెకర్లలో లిస్టులో టాప్‌లో ఉంటాడు వివి వినాయక్. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేశ్, ప్రభాస్‌తోపాటు లీడింగ్ హీరోలతో సినిమాలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. వివి వినాయక్ ఫిల్మోగ్రఫీలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్లోని అన్ని యాంగిల్స్‌ను వాడుకొని సిల్వర్ స్క్రీన్‌పై ఓ వైపు కడుపుబ్బా నవ్విస్తూ.. మరోవైపు యాక్షన్ ఎలిమెంట్స్‌తో దుమ్ముదులిపేశాడు.
తారక్ కెరీర్లో వన్ ది బిగెస్ట్ హిట్‌గా నిలిచిన అదుర్స్ సినిమాను ఎంజాయ్ చేయని మూవీ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందా..? ఇప్పటికే తారక్ అభిమానులతోపాటు సినీజనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అదుర్స్ 2పై ఓ ఈవెంట్లో కుండబద్దలు కొట్టేశాడు వివి వినాయక్. పాపులర్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..
నిజంగా చెప్పాలంటే అదుర్స్ సినిమా అక్కడితో పూర్తయ్యిందన్నాడు వివి వినాయక్. అంతేకాదు అదుర్స్‌లో ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదన్నాడు. ఒకవేళ బలవంతంగా సీక్వెల్ తీసినా, మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదు. దాన్ని అలాగే వదిలేయడం మంచిదని చెప్పుకొచ్చాడు. వివి వినాయక్ చేసిన ఈ కామెంట్స్‌తో ఇక అదుర్స్ 2 ఉండదని క్లారిటీ ఇచ్చేసినట్టైంది.
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు