Vijay Kanakamedala | ఆరు నెలలు పరిశోధన చేశా!
“నిత్యం మనం ఎన్నో మిస్సింగ్ కేసుల్ని చూస్తున్నాం. కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నివేదికలు కోరిన సందర్భాలున్నాయి. ఈ అంశంపై పరిశోధన చేసి ‘ఉగ్రం’ చిత్రాన్ని తీశాను’ అన్నారు విజయ్ కనకమేడల.
“నిత్యం మనం ఎన్నో మిస్సింగ్ కేసుల్ని చూస్తున్నాం. కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నివేదికలు కోరిన సందర్భాలున్నాయి. ఈ అంశంపై పరిశోధన చేసి ‘ఉగ్రం’ చిత్రాన్ని తీశాను’ అన్నారు విజయ్ కనకమేడల. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కనకమేడల శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు.
నరేష్ ఇప్పటివరకు విభిన్న కథల్లో నటించినా..రౌద్రరసపూరితమైన కథాంశంతో సినిమా చేయలేదు. ఇది ఆయనకు కొత్తగా ఉంటుందనిపించింది. కథ చెప్పగానే నరేష్ వెంటనే ఓకే చేశారు. ఈ కథపై ఆరు నెలల పాటు పరిశోధన చేశాను. ‘ఉగ్రం’ మంచి యాక్షన్ థ్రిల్లర్. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో నరేష్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా యాక్షన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాం. పోలీస్ పాత్రలో పర్ఫెక్ట్గా కనిపించడానికి నరేష్ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ తీసుకున్నారు.
సామాజిక అంశాలు ఉండవు
ఈ సినిమా కథానుగుణంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతీ ఫైట్ వెనక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రేక్షకులు ఆ భావోద్వేగాల్ని ఫీలవుతారు. కథలో అధికభాగం రాత్రి వేళల్లో జరుగుతుంది కాబట్టి నైట్షూట్స్ ఎక్కువ చేశాం. ఈ కథలో సామాజిక అంశాలేవీ ఉండవు. అలాంటి చర్చించడం కూడా నాకు ఇష్టం ఉండదు. కమర్షియల్ పంథాలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. హీరో నరేష్ ఇప్పటికే ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఈ సినిమా ఆయనలోని యాక్షన్ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య కోసం ఓ కథ అనుకుంటున్నా. అదొక మంచి సోషల్డ్రామా. మరి కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

