Ahimsa Movie Trailer Released | స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు, రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా చిత్రబృందం అహంస ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌తోనే స్టోరీపై కొంత హింట్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే హీరో అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. మరీ ఆ సమస్య ఏంటీ ఆ సమస్య నుండి హీరో బయటకు పడ్డాడా అనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్‌తో అర్థమవుతుంది. హీరోయిన్ సదా చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పర్వాలేదనిపించేలా ఉంది. ఆర్. పీ పట్నాయక్ సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోతుంది. పాత మ్యూజిక్‌నే రిపీట్ చేసినట్లు అనిపిస్తుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి మాత్రం బాగుంది.
ఇక దర్శకుడు తేజ తన కెరీర్ బిగెనింగ్ నుండి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. వాళ్లకు మంచి లైఫ్‌ను ఇస్తుంటాడు. ఈ సినిమాతో దగ్గుబాటీ మూడో తరం వారసుడు అభిరామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తేజ కొత్తవాళ్లతో తీసిని సినిమాలన్ని దాదాపుగా హిట్లే. ఈ సినిమా కూడా అభిరామ్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి నటించింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.