దర్శకుడు తేజ చిత్రాల్లో పాటలకో ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో ఈ దర్శకుడిది పాటలకు మంచి కాంబినేషన్. ఈ ద్వయం మరోసారి ఓ సినిమా కోసం కలుస్తున్నారు. ఈ సినిమా పాటల కసరత్తును తాజాగా గోవాలో ప్రారంభించారు. దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గీత రచయిత చంద్రబోస్ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మంగళవారం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాం అంటూ వీరు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వీరి కాంబినేషన్ సినిమా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.