పవర్ స్టార్ వకీల్ సాబ్ గా రీ ఎంట్రీతో అదరగొట్టాడు. ఏప్రిల్ 9న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో ఉంది. మరోవైపు వకీల్ సాబ్ సినిమాపై సామాన్యులతో పాటు సినీజనం నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈసినిమాని తెరకెక్కించిన దర్శకుడు వేణుశ్రీరామ్ ని అభినందనలతో ముంచెత్తారు దర్శకుడు సుకుమార్. పవర్ స్టార్ కి సూపర్ సక్సెస్ నిచ్చిన వకీల్ సాబ్ చిత్రయూనిట్ కి విషెస్ చెప్పారు.