12ఏండ్ల ఆకలి తీరింది!
‘ఈ ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా విషయంలో నేను త్రివిక్రమ్‌కు థాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నప్పుడు దర్శకుడు సుజిత్ పేరును త్రివిక్రమ్ సూచించారు.
‘ఈ ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా విషయంలో నేను త్రివిక్రమ్‌కు థాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నప్పుడు దర్శకుడు సుజిత్ పేరును త్రివిక్రమ్ సూచించారు. పవన్‌కల్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా తీశాం’ అన్నారు నిర్మాత డి.వి.వి.దానయ్య. ఆయన నిర్మాణంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ సినిమాకు అద్భుతమైన టీమ్ కుదిరిందని, ఈ విజయం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన చెప్పారు. దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ‘దాదాపు మూడేళ్ల ప్రయాణమిది.
పవన్‌కల్యాణ్ వల్లే ఈ కథకు ఇంతటి భారీతనం వచ్చింది. నేను ఆయన వీరాభిమానిని. ‘జానీ’ టైంలో ఆయన్ని ఓసారి కలిస్తే చాలనుకునేవాడిని. కానీ ఈ రోజు ఆయనతో తీసిన సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఎక్కడ చూసిన ఓజీ హంగామా కనిపిస్తున్నదని, ప్రజలు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారని, ఈ విజయంతో భవిష్యత్తులో మరింత బాధ్యతగా పనిచేస్తానని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. ఈ సినిమా పంపిణీలో తాము ఓ భాగమని, ఈ సినిమా చూసిన అభిమానులు 12 ఏళ్ల ఆకలి తీరిందని చెబుతుంటే సంతోషంగా ఉందని నిర్మాత నాగవంశీ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

