సున్నితమైన భావోద్వేగాలతో ప్రేమకథలను, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ చిత్రంతో మాస్ బాట పట్టాడు. తాజాగా ఆయన ‘పెద్దకాపు-1’పేరుతో న్యూఏజ్ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆదివారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ఇది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. విరాట్ కర్ణ పాత్రతో పాటు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది’ అన్నారు. రావు రమేష్, ఆడుకలం నరేష్, తనికెళ్లభరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి.జె.మేయర్.