Mehreen Pirzada | పంజాబీ సుందరి మెహరీన్ తొలిసారి ఓ హారర్ సినిమాలో భాగం కానుంది. తమిళ దర్శకుడు శబరీష్ నంద తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో సెకండ్లీడ్ నాయికగా అనికా సురేంద్రన్ నటిస్తున్నది. వసంత్ రవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జాఫర్ సాదిక్, ఇర్ఫాన్ మాలిక్ నిర్మాతలు.
త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. పోలీస్ నేపథ్య కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో మెహరీన్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. తన కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమైన చిత్రమని, తొలిసారి ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నానని మెహరీన్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘ఎఫ్-3’ చిత్రంలో నటిస్తున్నది.