దర్శకేంద్రుడి తెరంగేట్రం

కమర్షియల్ సినిమాకు సరికొత్త భాష్యాన్ని చెప్పారు కె.రాఘవేంద్రరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ఆయన తొలిసారి నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లిసందడి’. ఇందులో రాఘవేంద్రరావు వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ఆయన ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘మౌనముని కెమెరా ముందుకు వస్తున్నారు’ అంటూ రాజమౌళి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో రాఘవేంద్రరావు సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. వశిష్టగా రాఘవేంద్రరావు పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని దర్శకురాలు గౌరి రోణంకి చెప్పింది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. రోషన్, శ్రీలీల, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామ, సంగీతం: కీరవాణి, మాటలు: శ్రీధర్ సీపాన, దర్శకత్వం పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకత్వం: గౌరి రోణంకి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

