‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు ప్రశాంత్‌నీల్. ఇటీవలే ‘సలార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన..ఆ చిత్రానికి సీక్వెల్ ‘సలార్-2’ (శౌర్యంగ పర్వం) కోసం సిద్ధమవుతున్నారు. ఈ మధ్య ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కన్నడ నటుడు ఉపేంద్ర తన అభిమాన దర్శకుడని చెప్పారు.
ఆయన కథను ప్రజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుందని, అసాధారణమైన అంశాలను స్పృశిస్తూ సినిమాలను తెరకెక్కిస్తుంటారని కొనియాడారు. ప్రశాంత్‌నీల్ మాట్లాడుతూ ‘ఏ, ఓం, ఉపేంద్ర వంటి సినిమాలను చూస్తే చాలా ఆశ్యర్యమేస్తుంది. ఇలాంటి కథలతో కూడా ప్రేక్షకులను మెప్పించవొచ్చా అనిపిస్తుంది. ఉప్రేంద తరహాలో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు’ అన్నారు. ప్రస్తుతం ఉపేంద్ర ‘యూఐ’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘చీప్’ అనే లిరికల్ సాంగ్ వైరల్ అయింది.