ఆ వార్తలను నమ్మొద్దు!
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. మాఫియా నేపథ్య కథాంశమిదని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఓ కీలకమైన షెడ్యూల్ కోసం చిత్రబృందం ఈ నెల రెండోవారంలో యూరప్‌కు పయనం కానుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్‌మీడియాలో వస్తున్న ఓ రూమర్‌పై దర్శకుడు ప్రశాంత్‌నీల్ స్పష్టతనిచ్చారు.
ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో రెండో భాగాన్ని కూడా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రశాంత్‌నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా తెరకెక్కింది. ‘సలార్’ రెండో భాగం కూడా ‘శౌర్యాంగపర్వం’గా రానుంది. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ కూడా రెండు భాగాలుగా వస్తుందని రూమర్ మొదలైంది. ఈ వార్తలను ప్రశాంత్‌నీల్ టీమ్ ఖండించింది. సినిమాపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని, కేవలం ఒకే భాగంగా రానున్న శక్తివంతమైన కథ ఇదని పేర్కొంది. దాంతో రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

