రొమాంటిక్ ‘రాజా సాబ్’
అగ్ర హీరో ప్రభాస్ ఇప్పటివరకు హారర్ కామెడీ జోనర్లో సినిమాలు చేయలేదు. దాంతో మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.
అగ్ర హీరో ప్రభాస్ ఇప్పటివరకు హారర్ కామెడీ జోనర్లో సినిమాలు చేయలేదు. దాంతో మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఈ సినిమాకు ‘రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుంగీ కట్టుకొని వింటేజ్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. దర్శకుడు మారుతి శైలి వినోదం, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన యాక్షన్, రొమాంటిక్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ప్రభాస్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో చక్కటి హాస్యం, రొమాన్స్ కలబోతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎస్కేఎన్, ఫైట్స్: కింగ్ సోలొమన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, రచన-దర్శకత్వం: మారుతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

