మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో?
‘ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా నటిగా రష్మికలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆమెను ప్రధానంగా చేసుకొని బలమైన కథలతో సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని మేకర్స్‌కి కలిగించిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్'.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నటిగా రష్మికలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆమెను ప్రధానంగా చేసుకొని బలమైన కథలతో సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని మేకర్స్‌కి కలిగించిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అందుకే ఇప్పుడు పలువురు దర్శకులు రష్మిక కోసం కథలు అల్లే పనిలో పడ్డారు. వారిలో ముందువరుసలో ఉన్నారు ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్. ఇప్పటికే రష్మిక కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారట. అయితే.. ఈ కథ అనుదీప్ గత చిత్రాల తరహాలో కామెడీ కాన్సెప్ట్ కాదట.
ఈసారి తన ధోరణికి పూర్తి భిన్నంగా భావోద్వేగాలతో కూడిన సీరియస్ కథనే అనుదీప్ సిద్ధం చేశారట. ఇక ఆ కథను నేషనల్ క్రష్‌కి వినిపించడమే తరువాయి. ఈ సినిమా తీసేందుకు స్వప్న సినిమా సంస్థ కూడా సిద్ధంగా ఉన్నదని తెలిసింది. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

