JSS Vardhan | ‘ది ట్రేటర్స్’ షోలో దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ అద్భుతమైన ప్రదర్శన.. మైండ్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న స్ట్రాంగ్ ప్లేయర్!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'ది ట్రేటర్స్ తెలుగు' (The Traitors Telugu) ఇప్పటికే ఆరు ఉత్కంఠభరితమైన ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్ తెలుగు’ (The Traitors Telugu) ఇప్పటికే ఆరు ఉత్కంఠభరితమైన ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. రెగ్యులర్ రియాలిటీ షోలకు పూర్తిగా భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్, మైండ్ గేమ్‌లు మరియు ఊహించని ట్విస్టులతో ఈ షో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ప్రముఖ దర్శకుడు, రచయిత జె.ఎస్.ఎస్. వర్ధన్ (SivaSai Vardhan Jaladhanki) తనదైన శైలిలో ఆటను ఆడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బుద్ధి బలంతోనే కాకుండా, ఫిజికల్ టాస్క్‌లలోనూ తన సత్తా చాటుతూ హౌస్‌లో ఒక బలమైన కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్నారు.
వర్ధన్ గేమ్ ప్లాన్ మరియు వ్యూహాలు:
గేమ్ ప్రారంభంలోనే చిన్మయిని ఫిల్టర్ లెస్ ఫేస్‌గా సెలెక్ట్ చేయడం దగ్గరి నుంచి, తోటి కంటెస్టెంట్ల ఆట తీరును గమనించడంలో వర్ధన్ తన తెలివితేటలను ప్రదర్శించారు. ఇక గౌరవ్ ట్రేటర్ కాదని నమ్మి అతనికి మద్దతుగా నిలిచిన అతి కొద్దిమందిలో వర్ధన్ ఒకరు. చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లను ట్రేటర్స్ టార్గెట్ చేయడంతో, విద్యులేఖను ట్రేటర్‌గా గుర్తించి రింగ్ ఆఫ్ డౌట్లో ఆమెను ఎలిమినేట్ చేయడంలో వర్ధన్ కీలక పాత్ర పోషించారు.
రాహత్ ఎలిమినేషన్ వెనుక మాస్టర్ మైండ్: షోలో అసలైన ట్రేటర్ అయిన రాహత్ మోనిషాను ఎందుకు ఎంచుకున్నాడనే అసలు వ్యూహాన్ని ఇతరులు గమనించకముందే వర్ధన్ పసిగట్టారు. మోనిషాను కాపాడుకునేందుకు రాహత్ వేసిన ప్లాన్‌ను అందరికీ వివరించి, రాహత్‌ను షో నుంచి బయటకు పంపడంలో ఆయన విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడింది.
నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు.. ఉత్కంఠగా రాబోయే ఎపిసోడ్స్:
ఆరో ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. “మై డియర్ ట్రేటర్… దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు! రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా!!” అంటూ వర్ధన్ ఇచ్చిన వార్నింగ్ షోపై క్యూరియాసిటిని విపరీతంగా పెంచేసింది. ఇప్పటికే హిట్ లిస్ట్‌లో ఉన్న వర్ధన్, శ్రావ్య, ధనుంజయ్లలో తదుపరి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ ప్రేక్షకులలో నెలకొంది.
జె.ఎస్.ఎస్. వర్ధన్ నేపథ్యం:
నెల్లూరుకు చెందిన జె.ఎస్.ఎస్. వర్ధన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో 2020లో ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయిలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రజాదరణ పొందిన ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లి గోల’ (సీజన్ 2) డిజిటల్ సిరీస్‌లతో పాటు, ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన ‘గీతా సుబ్రమణ్యం 2020’, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమాతో పాటు, ‘బ్యూటీ’ (Beauty – 2025) చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా తన ప్రతిభను చాటుకున్న వర్ధన్, ఇప్పుడు ‘ది ట్రేటర్స్’ రియాలిటీ షోలో తన మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తారో వేచి చూడాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

