దిలీప్ కుమార్ కెరీర్లో ఎవర్గ్రీన్ పాట ఇదే.. వీడియో

హైదరాబాద్: ప్యార్ కియాతో డర్నా క్యా .. బహుశా ఈ పాట వినని వారుండరు. మొఘల్ ఏ ఆజమ్ చిత్రంలోని ఆ పాట యావత్ సంగీత లోకాన్ని ఉర్రూతలూగించింది. ట్రాజిడీ కింగ్ దిలీప్ కుమార్ ఆ సినిమాలో సలీమ్ పాత్ర పోషించాడు. సలీమ్ మరో పేరు జహంగీర్. సలీమ్ పాత్రలో దిలీప్ నటించిన తీరు అద్భుతం. మొఘల్ చక్రవర్తి అక్బర్ కుమారుడే సలీమ్. యువరాజు సలీమ్‌ను వీరయోధుడిగా మార్చాలనుకున్న అక్బర్ తన కురుమారిడిని యుద్ధ విద్య నేర్చుకునేందుకు చిన్నతనంలో బయటకు పంపిస్తాడు. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సలీమ్‌కు .. తమ సభలో ఆస్థాన నర్తకి అయిన అనార్కలీ ప్రేమలో పడుతాడు. సలీమ్-అనార్కలీ ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్‌లో భగ్న ప్రేమికుడగా సలీమ్ తన నటతో ఆకట్టుకున్నాడు. తండ్రిని మెప్పించలేక.. ప్రియురాల్ని వదులుకోలేక.. ప్రిన్స్ సలీమ్ పడ్డ తపనను తన నటనలో అత్యద్భుతంగా చూపించాడు దిలీప్.
మధుబాలతో బ్రేకప్..
ఈ సినిమాలో అనార్కలీ పాత్ర పోషించింది మధుబాల. మొఘల్ ఏ ఆజమ్ సినిమా తీస్తున్న సమయంలో మధుబాల, దిలీప్ కుమార్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. షూటింగ్ సమయంలో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఓ దశలో వాళ్ల మధ్య రొమాన్స్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఇక వాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకున్నారట. కానీ ట్రాజిడీ కింగ్ దిలీప్‌కు .. మధుబాల దక్కలేదు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోగా.. ఆ ఇద్దరి మధ్య బంధం బలహీనడపింది. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొఘల్ ఏ ఆజమ్ అప్పట్లో అతిపెద్ద హిట్. 15 ఏళ్ల పాటు ఆ రికార్డును ఈ సినిమా నిలుపుకున్నది. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ సినిమాను .. ఇటీవల డిజిటల్‌గా కూడా మార్చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

