Diés Iraé On Hotstar | ఓటీటీలోకి ప్రణవ్ మోహన్ లాల్ ‘డీయాస్ ఈరే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Diés Iraé On Hotstar | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీయస్ ఈరే’ (Dies Irae).
Diés Iraé On Hotstar | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీయస్ ఈరే’ (Dies Irae). ఈ చిత్రం మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కావడమే కాక, దాదాపు రూ. 80 కోట్లకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. అయితే థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం డిసెంబర్ 05 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాను ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ లాంటి హారర్ హిట్స్ డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒక ఆర్కిటెక్ట్. తండ్రి వ్యాపారాలు అమెరికా, కేరళలో ఉండడంతో వాటిని మేనేజ్ చేస్తూ ఉంటాడు. కేరళకు వచ్చిన రోహన్ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో, తన క్లాస్మేట్ కని (సుస్మిత భట్) ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుస్తుంది. గతంలో కనితో శారీరకంగా బంధం ఉన్న రోహన్, తమ వ్యవహారాల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకుందేమో అనే అనుమానంతో వారి ఇంటికి వెళ్లి వస్తాడు. ఆ తర్వాత నుంచే అతన్ని ఒక ఆత్మ వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది కని ఆత్మే అని భావించి, పక్కింట్లో ఉండే మధు పొట్టి (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. ఈ క్రమంలో వారు తెలుసుకున్న నిజాలేమిటి? రోహన్‌ను వెంటాడుతున్న ఆత్మ ఎవరిది? అసలు ఫిలిప్ ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Watch Diés Iraé from December 5, only on JioHotstar.@impranavlal @rahul_madking @StudiosYNot @chakdyn @sash041075 @allnightshifts @studiosynot #DiésIraé #DiésIraéOnHotstar #PranavMohanlal #Horror #Thriller #Suspense #JioHotstar #JioHotstarMalayalam pic.twitter.com/JwQxiAYS7G
— JioHotstar Malayalam (@JioHotstarMal) November 29, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

