Dhurandhar 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్ 2’ ..పుష్ప2 రికార్డ్ కూడా బ్రేక్ చేసిందిగా..!
Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ సీక్వెల్ విడుదలైన కొద్ది రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ సీక్వెల్ విడుదలైన కొద్ది రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది కొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది.
ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో ఈ సినిమా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 16.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి, త్వరలోనే బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. విదేశాల్లో కూడా ఈ స్థాయి ఆదరణ రావడం చిత్రానికి భారీ ప్లస్‌గా మారింది. ఇండియాలో కూడా ఈ చిత్రం తన జోరు కొనసాగిస్తోంది. వీక్డేస్లోనూ స్ట్రాంగ్ హోల్డ్ ప్రదర్శిస్తూ మంగళవారం నాటికి రూ.575 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. కేవలం 5 రోజుల్లోనే రూ.500 కోట్ల నెట్ మార్క్‌ను అందుకుని, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న హిందీ చిత్రంగా పుష్ప 2 రికార్డును అధిగమించింది.
ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన మేకింగ్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. పవర్ఫుల్ కథ, దేశభక్తి నేపథ్యం, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదే సినిమా విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

