Chand Mera Dil | బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే, ‘కిల్’ సినిమాతో మెప్పించిన లక్ష్య జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘చాంద్ మేరా దిల్’. ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్ నేపథ్యంలో రాబోతున్న ఈ టీజర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన క్యాంపస్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన ప్రేమ, ఆ తర్వాత వారి జీవితాల్లో ఎదురైన మలుపులు, బాధాకరమైన సంఘటనలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించబోతున్నారు.
మరో విశేషమేమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగింది, ఇది తెలుగు ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. సచిన్-జిగర్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి, ఇప్పుడు మే 22న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.