Sir Movie | సార్ మూవీ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sir Movie On OTT | రిలీజ్‌కు ముందు జరిపిన ప్రమోషన్లతో తెలుగులో సార్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. పైగా తెలుగు నిర్మాణ సంస్థ కావడం, తెలుగు దర్శకుడు కావడంతో సార్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.
Sir Movie On OTT | కంటెంట్ కొత్తగా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధంలేకుండా పరభాష సినిమాలను కూడా బ్లాక్బస్టర్లు చేసేస్తుంటారు. ఇటీవలే విడుదలైన సార్ మూవీ కూడా ఈ కోవలోకి చెందిందే. ధనుష్‌కు తెలుగులో పర్వాలేదనిపించే మార్కెటే ఉంది. కానీ మరీ ఆయన సినిమాలు భీభత్సమైన కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు. గతేడాది రిలీజైన తిరు తమిళంలో రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. తెలుగులో రూ.4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే సార్ మూవీ మాత్రం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ధనుష్‌కు తెలుగులో ఊహించని విజయం దక్కింది. ఇందులో మరో విశేషం ఏంటంటే సార్ మూవీ తమిళ కలెక్షన్లతో పోలిస్తే తెలుగు కలెక్షన్లే అధికంగా ఉన్నాయి.
రిలీజ్‌కు ముందు జరిపిన ప్రమోషన్లతో తెలుగులో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. పైగా తెలుగు నిర్మాణ సంస్థ కావడం, తెలుగు దర్శకుడు కావడంతో సార్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం కుదరింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా మార్చి 17 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార సంస్థ నిర్మించింది. ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిస్తూ వెంకీ అట్లూరి ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సముద్రఖని ప్రతినాయకుడి పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

