Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు సాంగ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. ఇండియన్ ఇండిపెండెన్స్ కు ముందు జరిగిన స్టోరీ అని తెలుస్తుంది. బ్రిటీష్ పాలన నుంచి తన ప్రాంతాన్ని రక్షించే స్థానిక నాయకుడిగా ధనుష్ ఇందులో కనిపించబోతున్నాడు. ఇక ట్రైలర్ చూస్తుంటే.. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది.
మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కు సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ అప్డేట్ ప్రకారం కెప్టెన్ మిల్లన్ రన్ టైం 157 నిమిషాలు (2 గంటల 37 నిమిషాలు). శివకార్తికేయన్ నటిస్తోన్న అయలాన్ కూడా ఇదే రోజు విడుదల కానుండటంతో.. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ (Killer Killer) నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో ధనుష్ కెప్టెన్ మిల్లర్‌గా ఎర్రటి స్కార్ప్ కట్టుకొని చేతిలో తుపాకీతో అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తూ అంచనాలు పెంచుతున్నాడు.