తన వాయిస్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ సునీత (Sunitha). ఈ సీనియర్ టాలెంటెడ్ సింగర్ మీడియా బిజినెస్ మెన్ రామ్ వీరపనేని (Ram Veerapaneni) (మ్యాంగో రామ్)ను పెళ్లి చేసుకుని..సక్సెస్ ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 43 ఏళ్ల ఈ క్రేజీ సింగర్‌పై ప్రెగ్నెన్సీ కన్ఫామ్ (Pregnancy Rumors) అయిందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే వీటిని చదివి షాకైన సునీత్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
‘మై గాడ్..జనాలు చాలా క్రేజీ. నా మొదటి మామిడి పంటతో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో నేడు పోస్ట్ చేయగా..ఇలా వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. అన్నీ ఊహించడం, పుకార్లను వ్యాప్తి చేయడం మానేయండి..దండం రా నాయనా ‘ అంటూ చేతిలో పచ్చి మామిడి కాయ పట్టుకుని దిగిన స్టిల్కు క్యాప్షన్ పెట్టింది. సునీతకు ఇప్పటికే ఓ కూతురు, కుమారుడు (మొదటి పెళ్లి) ఉన్నారు.
కాగా ఈ ఇద్దరు ఉన్నత విద్యను పూర్తి చేసి..తమ కెరీర్‌పై ఫోకస్ పెట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి టైంలో సునీత ప్రెగ్నెన్సీ అంటూ వచ్చిన వార్తలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి.