సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు. ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు ఎన్ఆర్ రెడ్డి మాట్లాడుతూ…‘అన్ని రకాల భావోద్వేగాలతో కూడుకున్న చిత్రమిది. సంపూర్ణేష్‌కు కొత్త తరహా సినిమా అవుతుంది. రివెంజ్ స్టోరీగా తెరకెక్కించాం. రొమాన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. ఐదు పాటలు ఉంటాయి. వినోద సన్నివేశాలు కథలో సహజంగా వస్తాయి. సంపూర్ణేష్ పాత్ర ఏంటి అనేది ఇంటర్వెల్ దాకా ప్రేక్షకులకు తెలియదు. అలా సస్పెన్స్‌గా తీసుకెళ్లాం. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. సెన్సార్ నుంచి ‘యూ. ఏ’ సర్టిఫికెట్ వచ్చింది’ అన్నారు.