రెండేళ్ల కష్టం ఫలించింది
“డెవిల్' చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు’ అన్నారు కల్యాణ్‌రామ్.
“డెవిల్’ చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు’ అన్నారు కల్యాణ్‌రామ్. ఆయన కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన ‘డెవిల్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదలుపెట్టిన కొద్ది రోజులకే మా సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్‌కు గుండె ఆపరేషన్ జరిగింది.
మూడు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినా..పద్దెనిమిది రోజుల్లోనే సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేశారు కాబట్టే ఈ విజయం సాధ్యమైంది’ అన్నారు. దర్శకనిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతీ సీన్ కొత్తగా ఉందని..సాంకేతికంగా అన్ని అంశాలు ఉన్నత విలువలతో ఉన్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

