Devara – Rajamouli | రాజమౌళి 23 ఏళ్ల ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ బ్రేక్.. కార్తికేయ స్పెషల్ పోస్ట్
Devara Breaks Rajamouli Record | దర్శక దిగ్గజం రాజమౌళితో సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయినట్లే అని అనుకునే హీరోలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళితో సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ అని ఖరారు అయిపోతారు. అయితే జక్కన్న సినిమాతో లక్‌తో పాటు బ్యాడ్ లక్ కూడా ఉంది.
Devara Breaks Rajamouli Record | దర్శక దిగ్గజం రాజమౌళితో సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయినట్లే అని అనుకునే హీరోలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళితో సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ అని ఖరారు అయిపోతారు. అయితే జక్కన్న సినిమాతో లక్‌తో పాటు బ్యాడ్ లక్ కూడా ఉంది. అయనతో సినిమా చేసిన ఏ హీరో అయిన తన తరువాతి సినిమా అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని. ఇది నిజంగా జరిగింది కూడా. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నం1 వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వగా.. ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్ సుబ్బు చిత్రం డిజాస్టార్‌గా నిలిచింది. అనంతరం రాజమౌళితో సింహాద్రి తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ హిట్ సంబరాలు చేసుకునేలోపే ఆంధ్రావాలా సినిమాతో అట్టర్ ఫ్లాఫ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆరే కాకుండా రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్‌లు కూడా రాజమౌళితో హిట్ అందుకుని తర్వాతి చిత్రం డిజాస్టార్ అందుకున్నారు.
అయితే 23 ఏండ్లుగా వస్తున్న ఈ సెంటిమెంట్‌ను ఎవరు స్టార్ట్ చేశారో అతడే బ్రేక్ చేశాడు. అవును రాజమౌళి 23 ఏళ్ల ఫ్లాప్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశాడు. తారక్ నటించిన స్టూడెంట్ నెం.1 సెప్టెంబర్ 27, 2001న విడుదలైంది. ఇప్పుడు దేవర కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ అయింది. దేవర సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ సూపర్ హిట్ అని.. రాజమౌళి 23 ఏళ్ల ఫ్లాప్ సెంటిమెంట్‌ను తారక్ బ్రేక్ చేశాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌పై స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
ఫైనల్‌గా 23 ఏళ్ల పురాణగాధకు బ్రేక్ పడింది. అదికూడా ఏ వ్యక్తి వలన ఏ రోజు అయితే స్టార్ట్ అయ్యిందో అదే వ్యక్తి మళ్లీ అదే రోజున బద్దలుగొట్టాడు. చిన్నప్పుడు నుంచి ఎంతో దగ్గరగా ఆయన ఎదుగుదల, సక్సెస్‌ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్ అంటూ కార్తికేయ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
23 years of MYTH…
Finally it was broken where it all began by the MAN HIMSELF on the SAME DAY again. Growing up watching him closely and now witnessing his wonders is what makes him so special to Telugu cinema. 🙏🏻🙏🏻Absolutely Speechless…
I’ve been screaming to say this…… pic.twitter.com/ZGr4AakzSF— S S Karthikeya (@ssk1122) September 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

