డిటెక్టివ్ సత్యభామగా నటిస్తున్న సోనియా అగర్వాల్

సోనియా అగర్వాల్(‘7/జీ బృందావన కాలనీ’ ఫేమ్) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. నవనీత్‌చారి దర్శకుడు. శ్రీశైలం పోలెమోని నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఆర్.కె.గౌడ్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను చర్చిస్తూ సందేశాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించాం. సోనియా అగర్వాల్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది’ అని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

