Dhurandhar The Revenge | ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు రూ.1700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలోని ‘డెస్టినీ – మన్ అత్కేయా’ అనే పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
శాశ్వత్ సచ్దేవ్ స్వరపరిచిన ఈ గీతం ఆధునిక ర్యాప్ మరియు సాంప్రదాయ సూఫీ సంగీతాల అద్భుత కలయికగా నిలిచింది. వైభవ్ గుప్తా, షాజాద్ అలీ, మరియు టోకెన్ తమ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా అండర్ కవర్ ఏజెంట్‌గా రణవీర్ సింగ్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు స్ఫూర్తినిచ్చే లిరిక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.