ప్రశ్నించడం నా నైజం.. ఎవరికీ తలవంచను: దీపికా పడుకోన్
‘స్పిరిట్' ‘కల్కి-2’ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ తొలగింపు వ్యవహారం భారతీయ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొద్దిమాసాల వ్యవధిలో భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి ఈ భామ నిష్క్రమణం ఆమె అభిమానులను కలవరపెట్టింది. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు దీపికా పడుకోన్.
‘స్పిరిట్’ ‘కల్కి-2’ చిత్రాల (Kalki-2) నుంచి దీపికా పడుకోన్ (Deepika Padukone) తొలగింపు వ్యవహారం భారతీయ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొద్దిమాసాల వ్యవధిలో భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి ఈ భామ నిష్క్రమణం ఆమె అభిమానులను కలవరపెట్టింది. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు దీపికా పడుకోన్. తన సోషల్‌మీడియా ద్వారా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ భామ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐఎమ్‌డీబీ సంస్థ ‘25ఏళ్ల భారతీయ సినిమా’ అనే అంశంపై ఓ నివేదికను విడుదల చేసింది. 130 చిత్రాలను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేయగా.. ఆ జాబితాలోని 10 చిత్రాల్లో దీపికా పడుకోన్ కథానాయికగా నటించడం విశేషం.
ఈ నేపథ్యంలో అమితాబ్‌బచ్చన్, రణబీర్‌కపూర్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, అలియాభట్, ప్రభాస్ వంటి అగ్ర తారలను వెనక్కినెట్టి ముందువరుసలో నిలిచింది దీపికా పడుకోన్. ఈ రికార్డును సొంతం చేసుకోవడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కల్కి-2’ వ్యవహారంపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది. కెరీర్ తొలిరోజుల్లోనే ఇండస్ట్రీలో ఎలా నెగ్గుకురావాలనే విషయంలో తనకు స్పష్టత ఉందని చెప్పిది. ‘నేను ముక్కుసూటిగా ఉంటాను. నమ్మిన విలువలను ఏరోజూ వదులుకోను. నాకు తప్పనిపిస్తే ఎంతటివారినైనా ప్రశ్నించడం మానుకోను. అది నా నైజం. అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటాను కానీ ఎవరికీ తలవంచను’ అని దీపికా పడుకోన్ చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

