Deepika padukone | దీపికా పదుకొనే ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. తాజాగా గెహ్రైయాన్ సినిమాలో నటించింది. గల్లీబాయ్ ఫేం సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించిన ఈ చిత్రంలో అనన్యపాండే మరో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ఇందులో దీపికా ముద్దు సన్నివేశాలు వైరల్‌గా మారాయి. పెళ్లయ్యాక ఇలా హద్దులు దాటి రొమాంటిక్ సీన్లలో నటించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో దీపికా జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దీపికాపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రొమాంటిక్, లిప్‌లాక్ సీన్ల గురించి మీ భర్త దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అంటూ నెటిజన్లు పెట్టిన కామెంట్స్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చింది దీపికా. ఇలాంటి ప్రశ్నలకు నేను రియాక్టవడం మూర్ఖత్వమే అవుతుంది. నా జీవితంలో నటనకు ఎంత ప్రియారిటీ ఉందో నాకు, నా భర్తకు తెలుసు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లని పట్టించుకోను, నా సినిమాల గురించి నా భర్తతో చర్చిస్తానా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు చాలా తెలివి తక్కువ వారు. అలాగే చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు’ అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-K తో పాటుగా షారుఖ్ ఖాన్‌తో పఠాన్ లో నటిస్తుంది.