Deepika Padukone | శాస్త్రవేత్తలు నీ గురించి మర్చిపోయినట్టున్నారు..నెటిజన్‌కు దీపిక కౌంటర్
సాధారణంగా కూల్‌గా ఉండే బాలీవుడ్ (Bollywood) తార దీపికా పదుకొనే (Deepika Padukone) తన వ్యక్తిగత విషయాలపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా స్పందిస్తుంటుంది.

సోషల్ మీడియాలో స్టార్లకు నెటిజన్లకు మధ్య మాటల యుద్దం జరగడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కూల్‌గా ఉండే బాలీవుడ్ (Bollywood) తార దీపికా పదుకొనే (Deepika Padukone) తన వ్యక్తిగత విషయాలపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా స్పందిస్తుంటుంది. గత కొద్ది రోజులుగా ఆమె కొత్త సినిమా గెహ్రయాన్ (Gehraiyaan) సినిమా ప్రచార వేడి పెరుగుతోంది. తాజాగా ఓ సోషల్ మీడియా నెటిజన్ పోస్టుపై ఆగ్రహించింది దీపిక.
బాలీవుడ్ న్యూటన్ సూత్రం ఏంటంటే..గెహ్రయాన్ సినిమా విడుదలకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ దీపిక దుస్తులు మరీ కురచగా అవుతున్నాయి అని పోస్టు చేశారో నెటిజన్. ఈ పోస్టుపై స్పందించిన దీపిక…ఈ విశ్వం ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లతోపాటు మూర్ఖులతోనూ నిండి ఉందనే విషయాన్ని చెప్పడం శాస్త్రవేత్తలు మర్చిపోయినట్లు ఉన్నారు అంటూ దీపిక కౌంటర్ ఇచ్చింది.
రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కిన గెహ్రయాన్ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. షకున్ బత్రా (Shakun Batra) దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ లో దీపిక పదుకొనే హీరో సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi)తో చేసిన రొమాన్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. రన్వీర్ తో పెళ్లయ్యాక దీపిక ఇలాంటి రొమాంటిక్ సినిమా చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే ఇవన్నీ నటిగా తన వృత్తిలో భాగమేనంటోంది దీపిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

