Deepika Padukone | బాలీవుడ్ జేజమ్మగా దీపిక పదుకోన్?
అందం.. అంతులేని ఆత్మాభిమానం.. వెరసి దీపిక పదుకోన్. గ్లామర్ పాత్రలే కాక, రాజసంతో కూడిన పాత్రలకు కూడా ఆమె కేరాఫ్ అడ్రస్ అవ్వడానికి కారణం అదే. పద్మావత్, బాజీరావ్ మస్తానీ చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో మరో పవర్ఫుల్ పాత్రలో దీపిక కనపడనున్నారు.
Deepika Padukone | అందం.. అంతులేని ఆత్మాభిమానం.. వెరసి దీపిక పదుకోన్. గ్లామర్ పాత్రలే కాక, రాజసంతో కూడిన పాత్రలకు కూడా ఆమె కేరాఫ్ అడ్రస్ అవ్వడానికి కారణం అదే. పద్మావత్, బాజీరావ్ మస్తానీ చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో మరో పవర్ఫుల్ పాత్రలో దీపిక కనపడనున్నారు. అది కూడా సాదాసీదా పాత్ర కాదు. తెలుగులో సంచలనాలు సృష్టించిన సినిమాకు చెందిన పాత్ర. ఆ సినిమా ఏంటో.. ఆ పాత్ర ఏంటో తెలుసుకోవాలనుందా!?.. ఆ సినిమా పేరు ‘అరుంధతి’.
ఆ పాత్ర పేరు ‘జేజమ్మ’. అవును.. త్వరలో దీపిక పదుకోన్ జేజమ్మగా బాలీవుడ్ తెరపై మెరవనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా నిశ్శబ్దంగా జరిగిపోతున్నదని ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగు సినిమాకు చెందిన ఓ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడే డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మథ్య ఓ థ్రిల్లర్ కథతో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

