దేవ్, ప్రియ చౌహాన్, సరిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దీనమ్మ జీవితం’. మురళీ రామస్వామి దర్శకుడు. వై.మురళీకృష్ణ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీరిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాను.
కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. నేటి యువతరం మెచ్చేలా ఉంటుంది. నటీనటులు చక్కటి ప్రతిభ కనబరిచారు. సాంకేతికంగా కూడా మంచి టీమ్ కుదిరింది’ అన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా మెప్పిస్తుందని హీరో దేవ్ తెలిపారు. తమ సంస్థ చేసిన కొత్త ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, సంగీతం: ఆర్.ఎస్, రచన-దర్శకత్వం: మురళీ రామస్వామి.