గతవారం సినీ ప్రేక్షకులకు చప్పగా సాగింది. గత కొన్ని నెలల నుండి ప్రతీ వారం ఏదో ఒక్క సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర కళకళలాడేది. కానీ గతవారం బాక్సాఫీస్ కలెక్షన్ల ఊసే లేదు. గత శుక్రవారం ఏకంగా 9 సినిమాలు రిలీజైతే అందులో ఒక్కటి కూడా హిట్ కాలేకపోయాయి. అయితే అందులో సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’, ‘పంచతంత్రం’ మినహాయించి మిగితా ఆరు సినిమాలు అసలు రిలీజైనట్టు కూడా తెలియకుండానే వెళ్ళిపోయాయి. అయితే ఈ వారం మాత్రం సినీ ప్రేక్షకులకు కన్నుల పండుగగా సాగనుంది. కాగా ఈ వారం థియేటర్, ఓటీటీలలో రిలీజైయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
అవతార్-2:
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది.
ఐ లవ్ యూ ఇడియట్:
శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజ్‌కు ముస్తాభవతుఉంది.
శాసన సభ:
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 16న విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వేణు మడకంటి దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూస్ సంగీతం అందించాడు.
సీనం:
ఇటీవలే ‘ఏనుగు’తో మంచి హిట్ సాధించిన అరుణ్ విజయ్ ఇప్పుడు సీనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆక్రోశం పేరుతో డిసెంబర్ 16న రిలీజ్ చేస్తున్నారు. కుమార వేలన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రం అరుణ్ విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
వీటితో పాటుగా ‘పసివాడి ప్రాణం’, ‘సుందరాంగుడు’ వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్:
ఫిజిక్స్ వాలా (హిందీ సిరీస్) డిసెంబరు 15
నెట్‌ఫ్లిక్స్:
డాక్టర్ జి (హిందీ) డిసెంబరు 11
అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16
కోడ్‌నేమ్: తిరంగా (హిందీ) డిసెంబరు 16
ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16
ద రిక్రూట్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 16
జీ5:
స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (హాలీవుడ్) డిసెంబరు 12
ఆహా:
ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16
డిస్నీ+హాట్‌స్టార్:
నేషనల్ ట్రెజర్: ఎడ్జ్ఆఫ్ హిస్టరీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 14
గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16