మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం డియర్ మేఘ. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మించారు.సెప్టెంబర్ 3న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.
తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘డియర్ మేఘ.. నా లైఫ్‌లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది’ అంటూ హీరో చెప్పే సంభాషణతో ట్రైలర్ మొదలైంది. తన ప్రేమను తనలో దాచుకుని బాధపడే ఓ అమ్మాయి కథే డియర్ మేఘ అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
ముక్కోణపు ప్రేమ కథలో ఎవరు ఎవరిని ప్రేమించారు? ఎవరి ప్రేమ గెలిచింది వంటి విషయాలు సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సినిమానికి హరి గౌర సంగీతం అందించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు శ్రోతలకు మంచి వినోదాన్ని పంచాయి.