మేఘ హృదయరాగం

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రమిది. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. తెరపై అందమైన ప్రణయభావనల్ని ఆవిష్కరిస్తుంది. మేఘాఆకాష్ అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. చాలా విరామం తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నానని, తన పేరుతో సినిమా రావడంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని కథానాయిక మేఘాఆకాష్ ఆనందం వ్యక్తం చేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘నేటితరంలో కూడా పవిత్రమైన ప్రేమ ఉందనే సందేశాన్ని అందించే కథాంశమిది. హరిగౌర చక్కటి సంగీతాన్నందించాడు. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయబోతున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ, ఆర్ట్: కె.వి.రమణ, రచన-దర్శకత్వం: సుశాంత్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

